South Central Railway: మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. పది రోజుల ముందే సంక్రాంతి హడావుడి మొదలైంది. పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంక్రాంతిని పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ శుభవార్త…
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని స్వగ్రామాలకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పలు పండగలకు సెలవులను ప్రకటించింది. దసరా పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజులు దసరా సెలవులు ఇచ్చింది.
తెలుగు స్టార్ నటి, స్నేహ గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదట తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ ఆ తరువాత ప్రియమైన నీకు శ్రీరామదాసు సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను సాధించింది..…
కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు.
రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈకార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొ్న్నారు. పొయ్యి మీద పొంగల్ వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.