సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో కూడా కోచ్‌లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 17 చైర్ కార్‌లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి…
సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి... అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్‌లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది.
అదేంటి నాన్న సినిమాకి పోటీగా శంకర్ కూతురు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. 2025లో తమిళనాడులో పొంగల్‌కు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అజిత్ విదాముయార్చి, బాల వనగన్, శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. అయితే చివరి క్షణంలో పొంగల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు విదాముయార్చి చిత్రబృందం నిన్న ప్రకటించింది.
సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు.
పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది. గాలిపటం ఎగురవేస్తూ ఆకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడుగా తెలుస్తోంది. గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవ శాత్తు భవనం పైనుండి ఆకాష్ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది.…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుదాఘాతానికి మరియు సరఫరాలో ట్రిప్పింగ్‌కు కారణమయ్యే అవకాశం ఉందని, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ స్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) ప్రజలకు సూచించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, TSSPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ప్రజలు విద్యుదాఘాతానికి కారణమయ్యే లోహపు పూతతో కూడిన దారాలను ఉపయోగించడం…
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ఇస్తున్నట్లు పేర్కొనింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు హాలీడేస్ ఇచ్చింది.