కమర్షియల్,యాక్షన్, కామెడీ అని అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడ దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 వసంతాలు పూర్తి చేసుకున్న అనిల్.. 8 సినిమాలకు దర్శకత్వం వహించి, 8 విజయాలను అందుకున్నారు. దీంతో టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాప్ ట్రాక్ రికార్డు లేని డైరెక్టర్లలో తను రెండో స్థానంలో ఉన్నాడు.ఇక ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రికార్డుల దుమ్ముదులుపు తుంది. దాదాపు రూ.250…
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించారు. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవల 13 రోజుల్లో రూ. 276 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రీజినల్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ …
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పండుగ కాలంలో విడుదలైన…
సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి... హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనపడటం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 11 రోజులకు గాను 246…
టాలీవుడ్ లో ఫేమస్ కాంబినేషన్ అంటే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇదే కాంబినేషన్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు, ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమాతో మన ముందుకు వచ్చి, మరో మంచి విజయాన్ని అందుకున్నారు. జనవరి 14 న విడుదలైన ఈ మూవీ చిన్న…
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. టైటిల్ కి తగ్గట్టే సినిమాని కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మొదటి రోజున టిక్కెట్లు కూడా దొరకనంతగా ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ సినిమా టికెట్ల సేల్స్ మరోసారి…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబో. ఈ క్రమంలో సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాక తాను సినిమాలు చేసే పంధా గురించి కామెంట్స్ అన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ మా ఊహకు మించిన విజయం ఇది, ప్రతి ఇంటికి వెళ్లి ‘మా సినిమా చూడండి’ అని ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమేనన్నారు. దిల్‌రాజుతో పాటు నా…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దెబ్బకి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నీ ఈ సినిమా చూడాలి అన్నట్టు ముందే ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా ఊహించని విధంగా ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న షోస్ అన్ని…