టాలీవుడ్ లో ఫేమస్ కాంబినేషన్ అంటే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇదే కాంబినేషన్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు, ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమాతో మన ముందుకు వచ్చి, మరో మంచి విజయాన్ని అందుకున్నారు. జనవరి 14 న విడుదలైన ఈ మూవీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్షన్ కూడా ఈ మూవీకి మంచి ప్లేస్ అయింది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తూ తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. మహేష్ బాబుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పార్టీకి మహేష్ బాబు హైలెట్ అయ్యారు.
ఇప్పటికే ఈ మూవీ చూసిన మహేష్ బాబు చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చేబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం మహేష్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నప్పటికి అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాలేదు. కానీ లాంగ్ హైర్ లో మహేష్ లుక్ మాత్రం జనాలకు ఆకట్టుకుంటుందని చెప్పాలి.