విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. టైటిల్ కి తగ్గట్టే సినిమాని కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మొదటి రోజున టిక్కెట్లు కూడా దొరకనంతగా ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ సినిమా టికెట్ల సేల్స్ మరోసారి భారీగా నమోదవుతున్నాయి. తాజాగా బుక్ మై షో ట్రైన్స్ ప్రకారం గత 24 గంటల్లో ఈ సినిమాకి సంబంధించి 350K టికెట్లు అమ్ముడయ్యాయి.
Urvashi Rautela: ‘డాకు మహారాజ్’ వివాదంలో ఊర్వశి.. సైఫ్ కి క్షమాపణలు
వెంకటేష్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న సినిమాగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. వెంకటేష్ తరఫున ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. ముఖ్యంగా రేవంత్ భీమాల బుల్లి రాజు అనే క్యారెక్టర్ చేయగా అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి హైదరాబాదులో అయితే టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద వెంకీ మామ కెరియర్ లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టడమే కాదు మరోసారి థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ రప్పిస్తోంది అని చెప్పొచ్చు.