‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబో. ఈ క్రమంలో సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడమే కాక తాను సినిమాలు చేసే పంధా గురించి కామెంట్స్ అన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ మా ఊహకు మించిన విజయం ఇది, ప్రతి ఇంటికి వెళ్లి ‘మా సినిమా చూడండి’ అని ప్రచారం చేయడానికైనా నేను సిద్ధమేనన్నారు. దిల్‌రాజుతో పాటు నా టీమ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ఈ సినిమా నాకు ప్రత్యేకం. ఐశ్వర్య రాజేశ్ పాత్రకు మహిళలందరూ కనెక్ట్ అయ్యారు, అలాగే మీనాక్షి చౌదరి కూడా బాగా నటించింది. బుల్లిరాజు పాత్రను కూడా ఆడియన్స్ బాగా ఆదరించారు. ఈ సినిమాను భీమ్స్ సంగీతం మరోస్థాయికి తీసుకెళ్లింది, వెంకటేశ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. సినిమా చర్చల దగ్గర నుంచి సెలబ్రేషన్స్ వరకూ అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఆయనతో ఇది మూడో సినిమా, అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ తనపై సెటైర్లు వేయించుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు అంటూ చెప్పుకొచ్చారు.
Director Bobby: ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టిన డైరెక్టర్ బాబీ ?
సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలా మంది స్టడీ చేసి ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, ఇక్కడ పడాలి, ఇక్కడ లేవాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది స్క్రీ ప్లే గురించి రివ్యూలు చెబుతున్నప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. అవన్నీ నాకేమీ తెలియదు. నాకు తెలిసిన సినిమా ఏంటంటే నాకు ఓ సినిమా మాకు థియేటర్ కి వెళ్లి నచ్చితే ఆడియన్ గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతాను. అదే నాకు తెలిసిన సినిమా నేను అలాంటి సినిమా నే చేస్తాను. ఇది ఎమోషన్ తో చెబుతున్నాను నేను చిన్నప్పటినుంచి చూసిన సినిమా ఇదే. నేను సినిమాని పెద్దగా చదువుకోలేదు, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతుంటే నేను కనెక్ట్ అయిపోయి నేను కూడా చప్పట్లు కొడతాను. వాళ్ళు విజిల్ వేస్తే నేను లేచి విజిల్ వేస్తాను ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్స్ కి గురి చేస్తే నేను ఎమోషనల్ అవుతాను. ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా, నేను ఆ థియేటర్లో ఉంటాను నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా. నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా, 8 సినిమాలు జర్నీ ఇది. ఇక మందు కూడా ఇలాగే ఉంటుంది. మీ ఆశీర్వాదాలు అంటూ అనిల్ చెప్పుకొచ్చారు.