‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతి వస్తున్నాం యూనిట్ వీక్షించింది. అనంతరం డైరెక్టర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా చూసిన వాళ్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.. చాలా సంతోషం అని అన్నారు. ఈ రోజుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. ఎఫ్2 రికార్డును బ్రేక్ చేసిందని తెలిపారు. సినిమా అన్ని కేంద్రాల్లోనూ అద్భుతంగా ప్రదర్శించపడుతుంది.. విక్టరీ వెంకటేష్‌తో ఇది తమకు మూడవ సినిమా.. ఇది కూడా సూపర్ హిట్ అవ్వడం చాలా సంతోషం అని డైరెక్టర్ పేర్కొన్నారు. మరోసారి సంక్రాంతికి తమ సినిమా రావడం.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ సినిమాతో పాటు తన అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అవడం సంతోషమని అనిల్ రావిపూడి తెలిపారు. మూడవసారి కూడా తమ కాంబినేషన్‌ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు.. చిరంజీవితో త్వరలో సినిమా ఉంది.. స్టోరీ డిస్కషన్ జరుగుతుంది.. ఆ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేస్తానని డైరెక్టర్ చెప్పారు.
Read Also: Ambati Rambabu: నచ్చితే కాళ్ళు, నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ ఆయన..
హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ.. తాను నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ అవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాం.. ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు, సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు శ్రీవారిని కూడా దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆరవ రోజు కూడా సినిమా అంతే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.. నేటితో ఎఫ్2 రికార్డు కూడా రీచ్ అయింది అని దిల్ రాజ్ చెప్పారు.
Read Also: Gaza Ceasefire:15 నెలల యుద్ధానికి తెర.. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రారంభం..