సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనపడటం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 11 రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక 11 రోజులకు గాను 246 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
RGV : వెంకటేష్ తో వర్మ ‘సిండికేట్’.. సర్కార్ కూడా?
సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లు అందరూ ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్నారని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ దిశగా సినిమా పరుగులు పెడుతోందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే రీజినల్ సినిమా కేటగిరీలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలింగా నిలవబోతోంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి కనిపించింది. బుల్లి రాజు అనే పాత్రలో నటించిన రేవంత్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో సినిమా మొత్తం బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసి ఎందుకు ఆసక్తి కనబరుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.