కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల…
సంగారెడ్డిలోని రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తుల హాజరయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి హరీష్ రావు…
పెళ్ళి తంతు జరుగుతోంది. పెళ్ళిలో వుండాల్సిన పెళ్ళికొడుకు పారిపోయాడు. ఏమయిందో ఏమో తెలీదు. పారిపోయిన పెళ్ళికొడుకు తిరిగి వచ్చాడు. ఆగిపోయిందనుకున్న పెళ్ళి సజావుగా సాగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మనాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డికి, కొండాపూర్ మండలం సింధురెడ్డి అనే యువతికి పెళ్ళి నిశ్శయం అయింది. డిసెంబర్ 12న పెళ్ళి జరగాల్సి వుంది. పెళ్ళికి గంట ముందు కుటుంబ సభ్యులతో పాటు పెళ్ళికొడుకు మాణిక్యరెడ్డి పరారయ్యాడు. పెళ్ళికొడుకుని పెళ్ళి మంటపానికి తీసుకెళ్ళేందుకు వచ్చిన పెళ్ళి కూతురు…
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసిరింది. తిర్యాని మండలం గిన్నెదరిలో 8.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలు నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల చలి బాగా పెరిగింది. నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న కనిష్ట…
సంగారెడ్డిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార…
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. 265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి…
హైద్రాబాద్ నగరం చుట్టూ రీజీనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి మరో ముందడుగు పడింది. తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణను ప్రారంభించింది. దీనిపై కేంద్రం భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించే ఈ మార్గానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. వచ్చే 25-30 ఏళ్ల ట్రాఫిక్ అంచనాల మేరకు దీన్ని నిర్మించ…
చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
ఒకవైపు కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. అయినా జనంలో మార్పు రావడం లేదు. మాస్క్ మరిచిపోయారు. శానిటైజర్ దూరం పెట్టేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే కొందరు తమ వైఖరి మార్చుకోవడం లేదు. వ్యాక్సిన్ వేస్తాం రమ్మంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. READ ALSO ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా? తాజాగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో ఆరోగ్య సిబ్బందికి వింత అనుభవం…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా మూడు పువ్వులు-ఆరు కాయలుగా వర్థిల్తుతోంది. ఏదో ఒక చోట, ఏదో ఒక విధంగా గంజాయిని అక్రమరవాణా చేస్తూ కేటుగాళ్ళు పట్టుబడుతున్నారు. సంగారెడ్డిలో ప్రొహిబీషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కంది, చేర్యాల గ్రామం ,రుద్రారం,భానూరు, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గంజాయి లభ్యం అయింది. చేర్యాల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి , భానూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల నుండి…