తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు.
రాష్టంలో టీఆర్‌స్ ప్రభుత్వం వచ్చాక మహిళల ఆత్మ గౌరవం పెరిగింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ లక్షా 117 రూపాయలు ఇస్తున్నాం.పెద్ద ఆపరేషన్ కాకుండా ప్రైవేట్ హోస్పిల్ కు వెళ్ళకుండ కేసీఆర్ కిట్టుతోపాటు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కళ్ళు కనిపిస్లాలేదు. నీళ్లకు,కర్రెంట్ కు ఇబ్బంది లేకుండా చేశాం.
రాష్టంలో ఒకడు పాదయాత్ర, మరొకడు మోకాళ్ళ యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. 60 ఏళ్ళలో ఏం జరగలేదు 6 ఏళ్లలో చేసి చూపించింది టీఆర్ఎస్ పార్టీ. ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి. మీరు అధికారంలో వున్న కర్ణాటకలో రెండు వేల పింఛన్ ఇచ్చాక పాదయాత్ర చేయాలన్నారు. ప్రజలను మోసం చేయాలని మాట్లాడుతున్నారు.
బీజేపీ పాలిస్తున్న రాష్టాల్లో తెలంగాణ రాష్టంలో ఇస్తున్న పథకాలు ఉన్నాయా? ప్రభుత్వ పథకాలు పైరవీలు, లంచాలు లేకుండా డైరెక్టు గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ.100 అబద్దాలు ఆడైన అధికారం లోకి రావాలని చూస్తోందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా ఇప్పుడు 400 గ్యాస్ ధర కాస్తా 1000 దాటింది. మళ్ళీ కట్టెలు పొయ్యిలు వస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీ అమౌంట్ 400 నుండి 40 రూపాయలకు చేరింది. సబ్సిడీ అమౌంటు వేయడంలేదు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తుంది.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్‌రెడ్డి స్వీట్ వార్నింగ్..! శాశ్వత బహిష్కరణే..!
11 వేల కోట్లు మాయం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచుతుంటే బీజేపీ ప్రభుత్వం పెంచుతూ పోతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే పేద ప్రజలకు సిలిండర్ ధరల భారం తగ్గుతుందన్నారు మంత్రి హరీష్ రావు.