సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. కరోనా సమయంలో వెంటిలేటర్ కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కరోనా సమయంలో భారతీయులు ఎన్నో ఆవిష్కరణలు చేశారు. మన దేశం నుండి కోవిడ్ వాక్సిన్ వచ్చింది. మన దేశం నుండి గొప్ప గొప్ప ఆవిష్కరణలు రావడం నాకు గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగానికి క్యాపిటల్ గా వుందన్నారు. తెలంగాణ నుండి ప్రపంచ వాప్తంగా వాక్సిన్, మందులు ఎగుమతి చేశారన్నారు.