Hyderabad:రిటైర్డ్ పంచాయితీ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు! భారీగా ఆస్తుల గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని శంషాబాద్ లోని సంగారెడ్డి మండల రిటైర్డ్ పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2కోట్ల 31 లక్షల 63వేల 600 అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం.
అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం శంషాబాద్ లోని సంగారెడ్డి మండలలోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.31 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. రూ.43.79 లక్షల విలువచేసే నాలుగు ఓపెన్ ప్లాట్ల పత్రాలను, రూ.8.11 లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును సీజ్ చేశారు.
Also Read
సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందిందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. దీంతో అల్వాల్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో రూ.2.31 కోట్ల ఆస్తులను గుర్తించామని వెల్లడించారు. బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. శంషాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. సురేందర్‌రెడ్డి బావమరిది బినామీగా రెండు ఆస్తులను గుర్తించామన్నారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని చెప్పారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో మాజీ పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం నాడు మధ్యాహ్నం అదుపులో తీసుకున్నారు. శంషాబాద్ నుండి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి సురేందర్ రెడ్డిని తరలించారు. అనంతరం మీడియా ముందు వివరాలు వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!