సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్టయిలే వేరు. రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తూనే వుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని కంది ఐఐటీ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల జగ్గారెడ్డి ,కుమార్తె జయరెడ్డి ,కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న యువతతో పాటు నియోజకవర్గంలోని యువతకు ,నిరుద్యోగులకు ఉద్యోగాల పై ఐఐటీ డైరెక్టర్ తో సమావేశంలో చర్చించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
హైదరాబాద్ ఐఐటీలో జగ్గారెడ్డి కుటుంబం
అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ని కలవడం జరిగిందన్నారు. కేంద్రంలోని ఆనాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ హైదరాబాద్‌కు ఐఐటీ మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా నన్ను పిలిచి నీ ప్రాంతానికి ఐఐటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో మహేశ్వరం దగ్గర సబితా ఇంద్రారెడ్డి,ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ హైదరాబాద్ కి సంబంధించిన అనేకమంది నాయకులు అడగడం జరిగింది.
కానీ నేను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లిన సందర్భంలో ఐఐటీ పిలిచి ఇవ్వడం జరిగింది. తక్షణమే 500 ఎకరాలు కావాలంటే కందిలో ఉందని రామకృష్ణా రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో వెంటనే కందిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో , ప్రజలతో మాట్లాడి రైతులతో మాట్లాడి ఒప్పించి భూమి సేకరించడం జరిగిందన్నారు.
ఆ రోజులలో ఈ ప్రాంతంలో ఎకరా భూమి 5 లక్షలు,6 లక్షలు ఉంది. కానీ ఐఐటీ ఎప్పుడైతే మంజూరు అయిందో సోనియా గాంధీ,రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న భూముల విలువ పెద్ద ఎత్తున పెరగడం జరిగిందన్నారు. ఐఐటీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. ఐఐటీ చుట్టుపక్కల 50 కిలోమీటర్లు భూమి విలువ పెరిగింది. ఐఐటీ పేరు చెప్పి ఎక్కడి నుండో వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. ఐఐటీ ఉద్దేశం నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు రావడం, ఈప్రాంతం అభివృద్ధి చెందడమే ప్రధాన కారణం.
ఆ రోజు భూమి ఇచ్చినవారికి ఎకరానికి 200 గజాల ప్లాట్ లు ఇవ్వడం జరిగింది. ఐఐటీ డైరెక్టర్ ఏమ్మన్నారంటే భూమి కోల్పోయిన ప్రాంతంలో చదువుకున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తర్వాత నియోజకవర్గంలోని యువత కి కోచింగ్ ఇచ్చి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అపోయింట్ చేస్తామని ఐఐటీ డైరెక్టర్ నాతో చెప్పడం జరిగింది. నేను ఏ ఆలోచనతో ఐతే ఇది తీసుకురావడం జరిగిందో అది సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ 50శాతం మాత్రమే పూర్తి అయింది..ఇంకా 50శాతం పూర్తి కావాల్సి ఉంది. ఎలాగైతే ప్రాజెక్ట్ పూర్తి అవుతూ వస్తుందో అలాగే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తాయి…చదువు లేని వారికి సైతం వారి వారి అర్హతలు బట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని డైరెక్టర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ప్రతి నెల ఉద్యోగాల కల్పనపై ఫాలో అప్ చేస్తాం. ఈ చుట్టూ పక్కన ఉన్న పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ లు వచ్చేలా ప్రస్తుతం ఉన్న స్కూల్ లో మరిన్ని క్లాస్ రూమ్స్ పెంచి అడ్మిషన్స్ వచ్చేలా చేస్తామన్నారు. ఐఐటీ లో పని చేసే వారి పిల్లలకు కూడా ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది.
ఈ స్కూల్ అడ్మిషన్ విషయంలో డబ్బులు ఉన్నవారికే కాదు పేద వారికి కూడా సమానంగా అవకాశం ఉంటుంది. ఈ చుట్టూ పక్కన గ్రామంలో ఉన్నవారు ఎవరైనా సరే సంగారెడ్డి లోని రాం మందిర్ లో ఉన్న నా ఆఫీస్ కి వచ్చి నా కొడుకుకు ఉద్యోగం కావాలి,స్కూల్ లో అడ్మిషన్ కావాలని నోట్ చేయించండి. ఒక నెల, రెండు నెలల అటు ఇటు ఐన ఉద్యోగాలు,స్కూల్ అడ్మిషన్ లు ఇప్పిస్తా ఇది నా బాధ్యత. ఇది నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీ లు,4 మండలంలో ఉన్న ప్రజలకు మీడియా ద్వారా తెలియచేస్తున్నా అన్నారు. జగ్గారెడ్డి పని ఇలా ఉంటుంది..ఇది ప్రజలు గమనించాలి. జగ్గారెడ్డి అక్కడ ఉంటాడా..!ఇక్కడ ఉంటాడా..! వాడిని తిడుతాడా..వీడిని తిడుతాడా అనేది మీకు వద్దు. రాజకీయ పంచాయితీ మీకు వద్దు. జగ్గారెడ్డి మాకు మంచి చేస్తున్నాడా లేదా అనేది ప్రజలు గమనించుకోండి. ఐఐటీ నేను ఏ ఆలోచనతో తెచ్చానో అది సక్సెస్ అయింది. నేను చెప్పింది ప్రతిది అమలు అయ్యే విధంగా ఇకనుండి పని జరుగుతుందన్నారు జగ్గారెడ్డి.