Congress : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండలోనూ వర్గపోరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం హాజరవడం లేదు.
నారాయణఖేడ్‌లో పీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి రచ్చబండ నిర్వహిస్తుంటే.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ దూరంగా ఉన్నారట. ఇద్దరి మధ్య గ్యాప్ రావడం వల్లే మాజీ ఎంపీ దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువ. అక్కడ రైతులు లేరనే కారణంతో రచ్చబండ నిర్వహించడం లేదట. గుమ్మడిదల మండల కేంద్రంలో మాత్రం రచ్చబండ నిర్వహించగా, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్, అసెంబ్లీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మిగిలిన మండలాల్లో రైతులు ఉన్నా రచ్చబండను లైట్ తీసుకున్నారు నేతలు.
Also Read
ఆందోల్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రచ్చబండపై ఊగిసలాటలో ఉన్నారు. హైదారాబాద్‌లో ఉంటూ నియోజకవర్గంలో కార్యకర్తల వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవడం తప్ప పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించడం లేదని రాజనర్సింహ వైఖరిపై కేడర్ గుర్రుగా ఉందట. సంగారెడ్డి ఎమ్మెల్యే.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం రచ్చబండకు బదులుగా జనంలోకి వెళ్లేలా ప్రోగ్రామ్ ప్రకటించుకున్నారు. ఈ నెల 21 వరకు డేట్ ఫిక్స్ చేశారు కూడా. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లి ఎప్పడు నిర్వహించేదీ చెప్పడం లేదు.
మొత్తానికి ఉమ్మడి జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమం మాత్రం చడీ చప్పుడు లేదు. కొన్ని చోట్ల చేస్తారు.. మరికొన్ని చోట్ల అడ్రస్ లేకుండా ఉంటున్నారు. మరి.. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి పీసీసీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేక స్థానిక నేతలకే అప్పగించి ప్రేక్షకపాత్ర పోషిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!