K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే…
Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక…
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు.
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు.
కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను…
Rythu Bharosa: గురువారం (జనవరి 2) సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలకమైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధానంగా రైతు భరోసా విధివిధానాలపై చర్చించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు విధానాలు చేయనున్నారు. రైతులకు ఆర్థిక…
Harish Rao : 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది…
Tummala Nageswara Rao : ఖమ్మం సత్తుపల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో 21 వేల కోట్ల రుణామాఫీ, 7,625 వేల కోట్ల రైతు బంధు, 3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు…