Grama Sabhalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల పాటు గ్రామసభలు కొనసాగాయి. అయితే.. కొన్ని చోట్ల ఆందోళనల మధ్య గ్రామసభలు ముగిశాయి. తమ పేరు జాబితాలో లేదంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు.. అయితే.. ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఈ నెల 26…
Tummala Nageswara Rao : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జనవరి 26 నుంచి రాష్ట్ర రైతులకు “రైతు భరోసా” అందించనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ , సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసకర పాలన వల్ల…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అర్హల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది. గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి కారు పార్టీ నేతకు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు.
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల…
Bhatti Vikramarka : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని…
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్త చేసింది.
Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు,…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు.