వరుసగా ఐదో సారి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
ఏలూరు జిల్లా పర్యటనలో వున్నారు సీఎం జగన్. గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేశారు.
సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 93 శాతం అమలు చేశాం. చంద్రబాబు హయాంలో కేవలము కొంత మందికే పథకాలు అందేవన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జన్మభూమి కమిటీ ఆమోదిస్తేనే పథకాలు అందేవి. ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా కేవలం పేదరికం చూసే పథకాలు అందిస్తున్నాం. ఎక్కడా లంచాలకు తావు లేకుండా అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు మీటర్లు బిగిస్తే ఉరి తాడు వేసుకున్నట్టే అని చంద్రబాబు అంటున్నారు. గతంలో ఉచిత కరెంట్…
కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రైతుల రూ. 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమే. రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా?…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1, 2022 నుంచి పెన్షన్ రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్.జగన్ సర్కార్ కానుక అందించింది. పెన్షన్ను రూ.2500కు పెంచి ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో రూ.2500 పెన్షన్ మొత్తాన్ని పెట్టనుంది వైయస్.జగన్ సర్కార్. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్. డిసెంబర్, జనవరిల్లో కార్యక్రమాలను జగన్ వివరించారు. స్పందన వీసీలో…