Niranjan Reddy: తెలంగాణ భవన్ లో నేడు (బుధవారం) మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వం కు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలకు రైతు బందు ఇచ్చారని తప్పు పట్టారన్నారు. అయితే ఇప్పుడు కూడా…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు, ఈరోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 70 లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో రూ. తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతు భరోసా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహాను భావుడు రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయం అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే వ్యవసాయమని తెలిపారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది…
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ…
రైతు భరోసా నిధుల పంపిణీలో రికార్డు సృష్టించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 6 రోజుల్లో రూ. 7700 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏడేండ్లలో రైతులకు నిధుల పంపిణీలో ఇదే రికార్డు అని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందించటంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. తొమ్మిది రోజుల్లో రూ. 9…
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది.
రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు.
Deputy CM Bhatti: గత ప్రభుత్వం హయాంలో రైతులు వాడిన విద్యుత్ కు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిన వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించి.. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి.. 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయని తేల్చి చెప్పారు.