Russia: రష్యాకు వ్యతిరేకంగా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అక్కడి ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్ కి ఎదురుతిరిగారు. ఆ సంస్థ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాలో మిలిటరీ పాలనను గద్దె దించుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ముగిసింది.
Russia: రష్యాలో సంచలనం సృష్టించిన తిరుగుబాటు ఎట్టకేలకు చల్లబడింది. తిరుగుబాటు విషయంలో వాగ్నర్ గ్రూప్ మొత్తబడింది. మాస్కో వైపు తన దళాల్ని నడిపిస్తానంటూ శనివారం ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రష్యాలో రక్తపాతం నివారణకే ఇలా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రష్యాలో చెలరేగిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు రష్యా మిత్రదేశం బెలారస్ సహాయ పడింది. బెలారస్ మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూప్, రష్యా ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.
Putin: రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో దేశ ప్రజలు ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. సా
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది.
PM Modi: రష్యాపై భారత వైఖరి స్పష్టంగా ఉందని, భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
Joe Biden: అమెరికాను నమ్మి రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు పెద్దన్న పెద్ద షాకే ఇచ్చింది. ఏ విషయంపై ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైందో ఇప్పుడు అదే సాధ్యం కాదుపో అంటోంది. అ