ఉక్రేయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఉక్రేయిన్లోని పలు పట్టణాలపై రష్యా దాడులు చేస్తుంది. ఉక్రేయిన్పై జరుపుతున్న దాడుల్లో భాగంగా రష్యా ఖేర్సన్ పట్టణంపై దాడులు చేసింది.
47 సంవత్సరాలలో తన మొట్టమొదటి చంద్ర ల్యాండింగ్ వ్యోమనౌకను ప్రయోగించడానికి రష్యా తన తుది సన్నాహాలు చేసింది. చంద్రుని దక్షిణ ధృవం మీద గణనీయమైన నీటి మంచు నిక్షేపాల ఉనికిని కనుగొనడానికి రష్యా 25 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం రేపుతుంది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన రష్యా సైన్యం డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్ దాడి తరువాత మాస్కోలో విమానాల రాకపోకలను ఆపేశారు.
రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది.
ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆఫ్రికా దేశాలు రష్యాను కోరుతున్నాయి. ఈ మేరకు ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసి విజ్ఞప్తి చేశాయి.
రష్యా రాజధాని మాస్కోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ దగ్గర వేడి నీటి పైపు లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.