Pakistan Petrol Price: పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Petrol Price: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. ఇందుకు కారణం.. మంగళవారం పాకిస్థాన్‌లోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోలియం కొత్త ధరలను ప్రకటించనుంది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.15 పెరగనుంది. కాగా డీజిల్ ధరలు లీటరుకు రూ.20 పెరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో పెరిగిన ధరలు పెట్రోలియం ధరలను పెంచడం వెనుక వాదనలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 5 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ముడి చమురుపై బ్యారెల్‌కు 2డాలర్ల చొప్పున ప్రత్యేక ప్రీమియం ఛార్జీ విధించబడుతుంది.
Read Also:Vinayaka Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
గ్లోబల్ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు బ్యారెల్‌కు 97 డాలర్ల నుంచి 102 డాలర్లకు 5 డాలర్లు పెరిగాయని చెబుతున్నారు. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 272.95 ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 273.40 చొప్పున విక్రయిస్తున్నారు. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.19 పెంచారు. వాస్తవానికి రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు సరఫరాను పాకిస్థాన్ నిలిపివేసింది. ముడి చమురును శుద్ధి చేస్తున్నప్పుడు దాని నుండి పెట్రోల్ కంటే ఎక్కువ ఫర్నేస్ ఆయిల్ (చమురు వ్యర్థాలు) బయటకు రావడమే దీనికి కారణం. రష్యా చమురు దిగుమతిని నిలిపివేయాలని పాకిస్తాన్ నిర్ణయించిన వెంటనే, ఇప్పుడు ధరలు పెరగబోతున్నాయన్న విషయం కలకలం రేపింది.
Read Also:Gold: 76ఏళ్లలో రూ.89నుంచి రూ.59వేలకు బంగారం.. ప్రతేడాది 800 టన్నుల వినియోగం
రష్యా నుంచి చమురును ఎంత చౌక ధరలకు కొనుగోలు చేస్తున్నామో ఇప్పటి వరకు పాకిస్థాన్ వెల్లడించలేదు. అరబ్ దేశాల నుంచి వచ్చే చమురు కంటే రష్యా చమురులో ఎక్కువ వ్యర్థాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వెనుక రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోవచ్చని భావిస్తున్నారు. పెరిగిన ధరల ప్రభావం మిగతా వాటిపైనా పడనుంది.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!