Russia: రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్లో పేలుడు ప్రమాదం.. 27 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని డాగేస్తాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంత రాజధాని మఖచ్కల శివార్లలో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. రష్యా కాలమానం ప్రకారం.. రాత్రి 9:40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Soldier: జవాన్ కు ఘనంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు… వీడియో వైరల్
Also Read
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో మంటలు ప్రారంభమై సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించడంతో పేలుడు సంభవించిందని రష్యా ప్రభుత్వ అధికారులు. అయితే ఈ పేలుడు దాటికి 600 చదరపు మీటర్ల వరకూ మంటలు చెలరేగాయని నివేదికలు పేర్కొన్నాయి. గ్యాస్ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 250 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ కొందరినీ చికిత్స కోసం మాస్కోకు విమానంలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా అధికారులు నేర విచారణ ప్రారంభించారు.
Dozens of people were killed in Russia's Dagestan region after a fire started at an auto repair shop on a highway and spread to a nearby gas station, officials said https://t.co/u8pA5Iyopa pic.twitter.com/GvHMhlYGMy
— Reuters (@Reuters) August 15, 2023
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!