చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. మే నెలలో భారత దేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్లో దాదాపు 42 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ దేశం చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి.
Russia-Ukraine War: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 500 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం నాడు రెండేళ్ల బాలిక మరణించినట్లు చెప్పారు. చిన్నారుల మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం కష్టం.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల విడిభాగాల్లో కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
Russia: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్( FATF) నుంచి రష్యాను సస్పెండ్ చేశారు.
ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకోడానికి రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. అయితే.. రష్యా దళాలు కీవ్ నగరంపై అర్థరాత్రిపూట డ్రోన్ లతో దాడులు చేశాయని అధికారులు తెలిపారు, ఉక్రెయిన్ రాజధానికి వ్యతిరేకంగా నెల రోజుల పాటు వైమానిక దాడులను కొనసాగించారు.
Ukraine War: ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఉక్రెయిన్ నగరం బఖ్ముత్ ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ బలగాలకు, ప్రైవేట్ కిరాయి సైన్యం వాగ్నర్ ను అభినందించారు. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది.
PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే తప్పా.. తగ్గడం లేదు. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధ, ఆర్థిక సాయంతో ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. 30 క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో 29 క్షిపణులను కూల్చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రష్యా జరిపిన క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 18 క్షిపణులను కూల్చివేశాయని ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. యూఎస్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్‌తో అర డజను రష్యన్ హైపర్సోనిక్ క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.