భార్యలను ఎవరైనా ఏదైన అంటే భర్తలు గొడవలకు దిగడం సహజం.. కొన్ని గొడవలు కేవలం పంచాయితీతో ఆగుతాయి.. లేదా పోలీసుల చర్చలతో ఆగుతాయి. కానీ మరికొన్ని గొడవలు మాత్రం ఏకంగా మర్డర్ చేసే వరకు వెళ్తుంటాయి.. మనం అలాంటి గొడవలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఇక సోషల్ మీడియాలో రకరకాల గొడవలకు సంబందించిన వీడియోలు వైరల్ అవ్వడం కామన్.. తాజాగా అలాంటి ఓ గొడవ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్సులో నా భార్యకు సీటు…
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి…
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే.. మేడారం అనగానే గుర్తొచ్చేంది.. తినడం, తాగడం.. అందుకోసమని ఎన్ని డబ్బులు లెక్కచేయకుండా అక్కడికి వెళ్లి కనీసం మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు.
Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్ విప్పి పోలీసుల కార్ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే.
RTC Bus crashed into the fields: అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం ఉదయం హనుమకొండ జిల్లా ఓగులపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ 2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ…
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్న కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యాచరణ మొదలైంది.. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం.. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Common Mobility Card: విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది.
పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం.