Road Accident: ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్.. లారీ ఢీకొనడంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి.. కానీ, ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం.. బస్సులో ఉన్న అందరి ప్రాణాలు దక్కేలా చేసింది.. ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడటం ఏంటి..? అని ఆశ్చర్యపోకండి అదే నిజం లేదంటే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. వారిని ఓ ట్రాన్స్ పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అంటున్నారు బస్సులోని ప్రయాణికులు, స్థానికులు..
Read Also: Jasprit Bumrah: తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!
Also Read
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.. అయితే, నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ.. అందరీ ప్రాణాలు కాపాడింది.. ఎందుకంటే.. ఆ లారీని అనుకోని విధంగా ఆర్టీసీ బస్సుకు ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో.. పెను ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. లేకపోతే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెబుతున్నారు.. ట్రాన్స్‌పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయ్యింది.. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెట్లూరువారిపాలెం – ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది. లారీ డ్రైవర్‌కు గానీ, బస్సు డ్రైవర్‌కి గానీ ఎటువంటి గాయాలు కాలేదు.. అయితే, లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతిందని చెబుతున్నారు ప్రత్యక్షసాక్షలు.
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!