RTC Bus crashed into the fields: అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం ఉదయం హనుమకొండ జిల్లా ఓగులపూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెను ప్రమాదం తప్పడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వరంగల్ 2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళుతోంది. ఓగులపూర్ వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: ఏపీ తెలంగాణ భవన్‌ను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి!
బస్సు ప్రమాదంపై వరంగల్ 2 డిపో మేనేజర్ సురేష్ స్పందించారు. డ్రైవర్‌కి ఒళ్లు తిప్పడంతో సడన్ బ్రేక్ వేయగా.. బస్సు పొలాల్లోకి వెళ్లిందని చెప్పారు. ఓవర్ లోడింగ్‌తో పాటు ఫుట్ బోర్డులో కూడా ప్రయాణికులు ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వరంగల్ 2 డిపో మేనేజర్ తెలిపారు.