Accident: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్‌లోని ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణీకులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు కూలీల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.