సంక్రాంతి రేసులో మూడు బిగ్ మూవీస్ పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మూడు సినిమాలూ చాలా తక్కువ గ్యాప్ లో విడుదలకు సిద్ధమవ్వడం కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీ సినిమా వాయిదా అంటే మీ సినిమా వాయిదా…
టాలీవుడ్ నిర్మాతలు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పాన్ ఇండియా మూవీలు ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ ఉన్న నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా విడుదల పోస్ట్‌పోన్ తో పాటు మరికొన్ని సినిమాల వివరాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం కోసం కింద ఇచ్చిన లింక్‌లో చూడండి.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్‌లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం…
ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి డ్యూయాలజీ తర్వాత తనరాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్”. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచాయి. ఇక రాజమౌళి మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్అవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో…
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు. Read Also : సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం.…
నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్‌గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్‌లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు…
ఈరోజు రాత్రి ముంబైలో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సన్నద్ధమవుతోంది. అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చిత్ర బృందం మొత్తం ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోను “బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్” అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ…
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు…