సంక్రాంతి రేసులో మూడు బిగ్ మూవీస్ పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మూడు సినిమాలూ చాలా తక్కువ గ్యాప్ లో విడుదలకు సిద్ధమవ్వడం కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీ సినిమా వాయిదా అంటే మీ సినిమా వాయిదా వేసుకోండి అంటూ ఈ మూడు చిత్రాల నిర్మాతలు అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది, ముఖ్యంగా రాజమౌళి, ప్రభాస్ మధ్య ఉన్న ‘భీమ్లా నాయక్’ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. పలుసార్లు ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాకుండా అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే దీనిపై నిర్మాతల గిల్డ్ కూర్చుని సినిమాల విడుదల సమస్యను పరిష్కరించారు. దీంతో సంక్రాంతి క్లాష్ నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.
Read Also :
తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ “సంక్రాంతి సినిమాల విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము. ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమాలు… ‘ఆర్ఆర్ఆర్ ‘ మేకర్స్ రిక్వెస్ట్ వల్ల హిందీలో ‘గంగూబాయి కతియవాడి’ విడుదల తేదీని మార్చుకున్నారు. ఇక ‘రాధేశ్యామ్’ కూడా హిందీలో సోలోగా రిలీజ్ అవుతుంది. మన తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలి. మన తెలుగు స్క్రీన్స్ పై మూడు పెద్ద సినిమాలను ఒకేసారి విడుదల చేసే పరిస్థితి లేదు. ‘భీమ్లా నాయక్’ టీంతో మాట్లాడి సినేమా విడుదలను వాయిదా వేసాము. ‘భీమ్లా నాయక్’ విడుదల కొత్త తేదీ ఫిబ్రవరి 25న శివరాత్రికి రానుంది. అనుకున్న సమయానికే “ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్” రానున్నాయి. ‘ఎఫ్ 3’ సినిమా విడుదల కూడా వాయిదా వేసుకున్నాము. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమా ఏప్రిల్ 29కి మారింది. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కు రానుంది. పవన్ అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి” అంటూ సంక్రాంతి రేసులో ఉండే సినిమాల గురించి వెల్లడించారు.