ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి డ్యూయాలజీ తర్వాత తనరాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్”. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచాయి. ఇక రాజమౌళి మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్అవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రత్యేకమైన ఈవెంట్లను ప్లాన్ చేశారు. తాజాగా ముంబైలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’లో గూస్ బంప్స్ తెప్పించే అసలైన సీన్ అంటూ హింట్ ఇచ్చారు.
Read Also :
రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్’లో ఈ ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉంది. అది మీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సీక్వెన్స్‌ని సీక్రెట్‌గా ఉంచాము. దాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలి. ప్రస్తుతానికి ఈ సీక్వెన్స్ గురించి ఇంకేమీ రివీల్ చేయడం లేదు” అని రాజమౌళి తెలిపారు. సెకండాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని రాజమౌళి అంటున్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రానుంది.