IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం.. వన్డే ర్యాంకింగ్స్‌లో నం1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 3rd ODI Against New Zealand: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 295 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కివీస్‌కి ఒక్క విజయం కూడా దక్కకుండా సిరీస్‌ను ఊడ్చేసింది. అంతేకాదు.. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ భారత్ అగ్రస్థానానికి ఎగబాకింది. ఆల్రెడీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకొని, అరుదైన రికార్డు నెలకొల్పింది.
Manish Sisodia: ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించాలి..
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) మెరుపు శతకాలతో విరుచుకుపడి.. భారత్‌కి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే.. అదే జోరుని కొనసాగించడంతో ఇతర భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఒక దశలో విరాట్ కోహ్లీ (36) బాగానే రాణించాడు కానీ, ఆ వెంటనే ఔటయ్యాడు. ఇతరులు సైతం వచ్చినట్టే వచ్చి పెవిలియన్ దారి పట్టడంతో.. భారత్ స్కోర్ నెమ్మదించింది. అయితే.. చివర్లో హార్దిక్ పాండ్యా (54) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, భారత్ భారీ స్కోరు (385/9) చేయగలిగింది.
Health Policy: మీరు షుగర్ పేషంట్లైతే వెంటనే ఈ స్పెషల్ హెల్త్ పాలసీ తీసుకోండి
అనంతరం 386 లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. ఆదిలోనే వికెట్ కోల్పోయింది. అయితే.. డెవాన్ కాన్వే (138), నికోల్స్(42) కలిసి అదరొట్టేశారు. రెండో వికెట్‌కి వీళ్లు 106 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. కానీ, నికోల్స్ ఔటయ్యాక కివీస్ కాస్త కష్టాల్లో పడింది. ఇక డెవాన్ ఔటయ్యాక ప్రత్యర్థి జట్టు పూర్తిగా ఆశలు కోల్పోయింది. మిగతా వారెవ్వరూ భారీ స్కోర్లు చేయకపోవడంతో.. కివీస్ లక్ష్యానికి 91 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా.. చాహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు.
Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్స్ 2023.. పూర్తి జాబితా
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!