IND VS AUS : భారత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 4 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. కాబట్టి మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
Read Also: Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ
ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా చేయలేకపోయాడు. కానీ అహ్మదాబాద్ టెస్టులో మాత్రం 21 పరుగులు మాత్రమే చేసి భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది. 21 పరుగులు చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఇప్పటివరకు అతను 16,989 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ తన కెరీర్‌లో 13,214 పరుగులు చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ 15,593 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్..
సచిన్ టెండూల్కర్ – 34,357 పరుగులు
విరాట్ కోహ్లీ – 25,047 పరుగులు
రాహుల్ ద్రవిడ్ – 24,208 పరుగులు
సౌరవ్ గంగూలీ -18,575 పరుగులు
ఎంఎస్ ధోని – 17,266 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ – 17,253 పరుగులు
రోహిత్ శర్మ – 16,979 పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్…
సచిన్ టెండూల్కర్ – 34,357 పరుగులు
కుమార సంగక్కర – 28,016 పరుగులు
రికీ పాంటింగ్ – 27,483 పరుగులు
మహేల జయవర్ధనే – 25957 పరుగులు
జాక్వెస్ కలిస్ – 25,534 పరుగులు
విరాట్ కోహ్లీ- 25,047 పరుగులు