Jasprit Bumrah: ‘రిస్క్ తీసుకోలేం’.. బుమ్రా రీఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు కివీస్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయింది. ఈ టీ20 సిరీస్ ముగిసన తర్వాత భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగబోతుంది. వచ్చే నెల నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే జట్టను కూడా ప్రకటించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా గాయంపై రిస్క్ తీసుకోలేమని.. చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
Zomato Gold: జొమాటో కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్స్ బొనాంజా మళ్లీ వచ్చేసింది
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
“బుమ్రా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. వెన్ను గాయం కారణంగా మేము అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం. అతడు ఇంకా ఎంతో రాణించాల్సి ఉంది. బుమ్రా ఆరోగ్యం గురించి నేషనల్ క్రికెట్ అకాడమీలోని ఫిజియో, వైద్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూనే ఉన్నాం. డాక్టర్లు అతడికి కావాల్సినంత సమయాన్ని ఇస్తూ కమ్‌బ్యాక్ కోసం ఫిట్‌నెస్ సాధించేలా కృషి చేస్తున్నారు” అని రోహిత్ వెల్లడించాడు.
Fact Check: బాలయ్య పేరుతో ఫేక్ లెటర్.. మండిపడుతున్న నందమూరి అభిమానులు
గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌నకు కూడా దూరమయ్యాడు. శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌తోనే పునరాగమనం చేయాల్సి ఉండగా గాయం తిరగబెట్టడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అతడు మళ్లీ ఎన్‌సీఏకి వెళ్లాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2022లో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ కీలకం కావడంతో బుమ్రా రాక కోసం టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. చివరి రెండు టెస్టులు మార్చి మొదటి, రెండు వారాల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!