Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..భారత్ నుంచి ఒకే ఒక్కడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు రోహిత్. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.
Also Read: Mark Waugh: ‘కోహ్లీ ఏమోకానీ.. రోహిత్ మ్యాచ్‌ను దూరం చేసేస్తాడు’
Also Read
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్‌మ్యాన్ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ కెరీర్‌లో 9వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్ 43వ శతకాన్ని పూర్తి చేశాడు.
లీడ్‌లో టీమిండియా
కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా.. గొప్ప పట్టుదలతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు. టీమ్‌మేట్స్ పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయినా రోహిత్ మాత్రం వారిపై ఎదురుదాడికి దిగి సెంచరీ చేశాడు. తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను (118 నాటౌట్) కొనసాగిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌కు జతగా జడేజా (34) క్రీజ్‌లో ఉన్నాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 80 ఓవర్లలో 226/5 స్కోర్ చేసింది. ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Viral News: యో చూస్కోబడ్లా..భర్త అనుకుని వేరే వ్యక్తి బైక్‌పై వెళ్లిన భార్య
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..