IND VS AUS 4th test : బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాలు సాధించింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్ నిర్ణయాత్మకం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాలంటే భారత జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోర్‌లో ఓటమి తర్వాత భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా రిస్క్ తీసుకునే అవకాశం లేదు.
నాలుగో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులకు అవకాశం ఉంది. అందులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మూడో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవచ్చు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. ఇండోర్ టెస్టులో ఆడిన ఉమేష్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. కాబట్టి అతనికి అవకాశం దక్కడం ఖాయమని భావిస్తున్నారు.
Read Also: IND VS AUS : అహ్మదాబాద్ టెస్టులో చరిత్ర సృష్టించనున్న రోహిత్
అలాగే ఇషాన్ కిషన్ కూడా నాలుగో టెస్టు మ్యాచ్‌లో టెస్టు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. తొలి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో కె.ఎస్. భరత్‌కి అవకాశం ఇచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 57 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించాడు. అందువల్ల నాలుగో టెస్టు నుంచి ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయవచ్చు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎలాంటి ఒడిదుడుకుల్లో చిక్కుకోకుండా నేరుగా ఆఖరి రౌండ్‌లోకి ప్రవేశించాలంటే.. నాలుగో టెస్టు మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే మ్యాచ్ డ్రా లేదా ఓడిపోయినా భారత జట్టు ఫైనల్‌లో ఆడే అవకాశం ఉంటుంది. ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు విజయంతో ఫైనల్ చేరింది. కాబట్టి ఇప్పుడు భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ రౌండ్‌లో ఆడేందుకు సమాన అవకాశాలు ఉన్నాయి.
నాలుగో టెస్టుకు భారత జట్టు ఇలా ఉండవచ్చు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ.