Rohit Sharma Reacts On Removing KL Rahul From Vice Captaincy: గత సంవత్సరకాలం నుంచి కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో.. వైస్ కెప్టెన్సీ పదవిని అతని నుంచి బీసీసీఐ లాగేసిన సంగతి తెలిసిందే! దీనిపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి రాహుల్‌ను తప్పించడంలో ప్రత్యేకత ఏమీ లేదని, దానికి ఎలాంటి అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటుందన్నాడు. ‘‘ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు.. వారికి మరింత సమయం ఇవ్వడం జరుగుతుంది. తమ సత్తా చాటుకోవడానికి అవకాశాలు ఇస్తూనే ఉంటాం. ఇక ఇక వైస్ కెప్టెన్ పదవిలో ఉన్నా, పదవి కోల్పోయినా.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో నెట్స్‌లో రాహుల్, శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తుండటంపై కూడా వివరణ ఇచ్చాడు. చివరి నిమిషం వరకూ.. ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు జరగొచ్చని, ఎవరైనా గాయపడితే వారి బదులు మరొకరు జట్టులోకి వస్తారని సమాధానం ఇచ్చాడు.
Siddharth- aditi: హిట్ సాంగ్ కు స్టెప్పులేసిన ప్రేమ జంట.. వీడియో వైరల్
కాగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో.. ఈ సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో అవకాశం ఇచ్చినా, కేఎల్ రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ తరుణంలోనే మూడో టెస్టు మ్యాచ్‌కి గాను శుభ్‌మన్ గిల్‌కు కూడా అవకాశం కల్పించారు. అయితే.. ప్లేయింగ్ 11లో ఎవరుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం నుంచి శుభ్‌మన్ గిల్ అయితే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో.. మూడో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్‌కే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Ashu Reddy: బ్రా లెస్ డ్రెస్ లో హాట్ బ్యూటీ..