Rohit Sharma Reacts On 3 Days Test Match Comments: ఈమధ్య టెస్ట్ మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. అంతెందుకు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లు కూడా మూడు రోజుల్లోపే ముగిసిపోయాయి. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే.. రెండున్నర రోజుల్లోనే ఆ మూడు టెస్ట్‌లో ముగిశాయి. దీనిపై క్రీడాభిమానుల దగ్గర నుంచి మాజీల దాకా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీడాకారులు తమ నైపుణ్యం కోల్పోతున్నారా? టెస్ట్ మ్యాచ్‌ని పూర్తి స్థాయిలో ఎందుకు ఐదు రోజులు ఆడలేకపోతున్నారు? అనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Husband Forces Wife: ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోమన్న భర్త.. ఆ పని చేసిన భార్య
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలంటే, ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. కేవలం భారత్‌లో మాత్రమే కాదు, విదేశాల్లోనూ టెస్ట్ మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరగట్లేదు. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచ్ కూడా కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. అయితే.. పాకిస్తాన్‌లో మాత్రం ఐదు రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచ్ బోర్ కొడుతోందని అభిమానులు అంటున్నారు. అందుకే, మేము మ్యాచ్‌లను మూడు రోజుల్లోనే పూర్తి చేస్తున్నాం’’ అంటూ ఘాటుగా చెప్పుకొచ్చాడు. ఓవైపు ఆ ప్రశ్నలకు సీరియస్‌గా జవాబు ఇస్తూనే, మరోవైపు పాక్ టెస్ట్ మ్యాచ్‌లు బోరింగ్‌గా ఉంటాయంటూ.. పరోక్షంగా చురకలంటించాడు రోహిత్ శర్మ.
Tractor Goes Viral : ట్రాక్టర్ పై దెయ్యం..? దానంతట అదే స్టార్ట్ అయ్యి..
ఇంకా మాట్లాడుతూ.. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోతే, చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం చేసుకోవాలన్నాడు. తొలుత బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదని, ప్రత్యర్థి తమపై ఆధిక్యం చెలాయించాక తొలి ఇన్నింగ్స్‌లో తమ స్కోర్ బోర్డుపై మరిన్ని పరుగులుంటే బాగుండేదనిపించిందని అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్ సాగలేదన్నాడు. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోంచించలేదని, అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఓడిపోయామని, తప్పకుండా పుంజుకుంటామని రోహిత్ తెలిపాడు.