భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆస్ట్రేలియాపై సిక్స్‌తో ఐసీసీ వన్డే టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సిక్సర్‌లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ 48 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ (45), డేవిడ్ వార్నర్ (42), సౌరవ్ గంగూలీ (42)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 2,160 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ 231 ఫోర్లు, 65 సిక్సర్‌లు బాదాడు. ఈ గణాంకాలతో ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యంత ప్రభావ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 250 సిక్స్‌లు బాదిన తొలి కెప్టెన్‌గా రోహిత్ మరో రికార్డ్ సాధించాడు. 338 సిక్సర్‌లు బాదిన రోహిత్.. షాహిద్ అఫ్రిది (351) రికార్డ్‌ను అధిగమించే దిశగా సాగుతున్నాడు.