బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.
RJD Coffin Remarks: కొత్త పార్లమెంట్ ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. బీఎస్పీ, బీజేడీ, అకాలీదల్, టీడీపీ, వైసీపీ వంటి 25 పార్టీలు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్…
గురువారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఈ రోజు ప్రశ్నించనున్నారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్ర నిత్యం వేధింపులకు గురవుతున్నారని.. ఆయనకు…
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో…
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కలిసి పోటీ చేస్తాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శనివారం తెలిపారు.