ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు బీహార్ మహఘటబంధన్ కూటమి నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తును ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని, కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం నేరాలను సహించదని, దోషులను కటకటాల వెనకకి పంపుతామని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ అభిమానుల అత్యుత్సాహం అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నితీష్ కుమార్‌ని పొగుడుతూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షమైన ఆర్జేడీ కూడీ ఈ వివాదాలపై ఆచితూచి స్పందిస్తోంది. తాజాగా ఓ అభిమాని నితీష్ కమార్ ‘‘దేశానికి రెండో గాంధీ’’ అని పొగుడుతూ బ్యానర్‌ని ఏర్పాటు చేశారు.
బీహార్‌లో ముస్లిం సమాజంలో కోల్పోయిన తన మద్దతును తిరిగి తీసుకురావడానికి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆయన తన నివాసంలో జేడీయూతో సంబంధం ఉన్న ముస్లిం నేతలతో సమావేశమయ్యారు.
Lalu Prasad Yadav: ప్రస్తుతం దేశంలో భారత్ వర్సెస్ ఇండియాగా వ్యవహారం నడుస్తోంది. కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ20 సమావేశాల్లో దేశాధినేతలకు విందు ఇచ్చే ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం, ఇదే విధంగా ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్ లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం ఈ వాదనలకు బలాన్ని…
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత హామీ ఇచ్చారని, కానీ అది ఏనాడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ యాదవ్ మండిపడ్డారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు.