RJD MLA on Poonch Attack: గురువారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు. ఇది భారీ వివాదానికి దారితీసింది. లాలూ యాదవ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే 2019 పుల్వామా దాడి తరహాలోనే పూంచ్ దాడి జరిగిందని, రెండు ఘటనల్లో పోలికలు ఒకేలా ఉన్నాయని అన్నారు.
2024 ఎన్నికలు రాబోతున్నాయని, పూంచ్ ఘటన పుల్వామా దాడిని పోలి ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని తెలుస్తోందని ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర ఆరోపించారు. పూంచ్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ దాడి వెనుక కారణం ఏమిటో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని భాయ్ వీరేంద్ర అన్నారు. ఆర్జేడీ నాయకుడి ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ, ఇలాంటి అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా కాషాయ పార్టీ స్పందించడం సిగ్గుచేటని పేర్కొంది.
Read Also: Satya Pal Malik: జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ పిలుపు.. ఆ కేసులో సత్యపాల్ విచారణ!
“ఆర్‌జేడీ నేతల ఆలోచనా విధానంపై జాలిపడుతున్నాను. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి ఆర్జేడీ ఒక్క మాట కూడా చెప్పడం లేదని, ఓట్ల కోసమే కేంద్రం పుల్వామా దాడి చేసిందని అన్నారు. ఆర్జేడీ నేతల ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించడం కూడా సిగ్గుచేటు. అధికారం కోసం వాళ్లు దేన్నైనా అమ్ముకోవచ్చు’’ అని బీజేపీ నేత అరవింద్ కుమార్ సింగ్ ఆర్జేడీపై మండిపడ్డారు.