Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఈ రోజు ప్రశ్నించనున్నారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్ర నిత్యం వేధింపులకు గురవుతున్నారని.. ఆయనకు ఏదైనా జరిగితే తాను ఎవరిని విడిచిపెట్టబోనని హెచ్చరించారు.
Read Also: IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా 4వ టెస్ట్, 3359 రోజుల క్రితం ప్రపంచ రికార్డు బద్దలయ్యే ఛాన్స్
ఇవన్నీ గుర్తుండిపోతాయని, సమయం చాలా శక్తివంతమైనది ట్వీట్ చేశారు. 74 ఏళ్ల లాలూ ఇప్పటికీ ఢిల్లీలో అధికార పీఠాన్ని కదిలించగలరని అన్నారు. మా ఓర్పును పరీక్షిస్తున్నారని ఆమె చెప్పింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఢిల్లీలోని తన కుమార్తె, ఎంపీ మిసా భారతి ఇంట్లో లాలూ ఉంటున్నారు. ఈ రోజు ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ మిసా భారతి ఇంటికి వెళ్లింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో అప్పటి రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తో పాలటు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా, హేమలు నిందితులుగా ఉన్నారు. 2004-2009 వరకు కేంద్ర రైల్వే మందిగా ఉన్న సమయంలో ఉద్యోగాలకు బదులుగా లాలూ, అతని కుటుంబ సభ్యులు భూమిని తీసుకున్నారు. దీనిపై 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీని, ఆర్జేడీ విమర్శిస్తోంది. లాలూను చూసి బీజేపీ భయపడుతోందని, గత 30 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నామని ఆయన భార్య రబ్రీదేవి అన్నారు.