పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఆగ్రాలోనూ యమునా తన భీకర రూపం దాల్చుతుంది. మరోవైపు యమునా నది నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే యమునా నీటి మట్టం అనేక ప్రాంతాలను తాకింది. యమునా నది నీరు కూడా తాజ్ మహల్ కాంప్లెక్స్ సరిహద్దు దగ్గరకు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
Dhavaleshwaram project: గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పోటెత్తుతున్నాయి.. చాలా మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు.. ఆయా రాష్ట్రాలు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయాయి..