బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో సనమ్ కుమారి(16), రీమా కుమారి(7)గా గుర్తించారు. సంజు మాంఝీ(8) మృతి చెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: Manipur: మణిపూర్, మయన్మార్‌ల మధ్య 70 కి.మీ కంచె.. అర్జెంట్‌గా అవసరమన్న సీఎం
అయితే రేపు తమ గ్రామంలో కర్మ పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసమని ఈరోజు గ్రామ మహిళల, బాలికలు పూజ కోసం నదిలో స్నానానికి వెళ్లారు. అయితే ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు గ్రామంలో కర్మపూజ కార్యక్రమంతో ఉత్సాహంగా ఉంటే.. ఒక్కసారిగా ఈ ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన 10 నుంచి12 మంది బాలికలు నదిలో స్నానానికి వెళ్లారని మృతురాలి తండ్రి మాంఝీ తెలిపాడు.
Read Also: Haryana: హర్యానాలో ఓ కాంట్రాక్టర్కు చిత్రహింసలు.. నోట్లో పేడ, ఉమ్మివేసి
ఈ విషాద ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. తప్పిపోయిన బాలికల కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సహాయం తీసుకుంటున్నారని తెలిపారు. మృతి చెందిన బాలికను ఎనిమిదేళ్ల సంజు మాంఝీగా గుర్తించగా.. సనమ్ కుమారి (16), రీమా కుమారి (7) అదృశ్యమయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.