MadhyaPradesh: నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా బుహ్రలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని దతియా వద్ద ఎల్ మినీ ట్రక్ నదిలో పడిపోయింది. మినీ లారీలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెన దాటుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ట్రక్కులో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. గ్వాలియర్‌లోని భేలేటి గ్రామం నుంచి తికమ్‌గఢ్‌లోని జాతర గ్రామానికి పెళ్లి కోసం వెళ్తున్నారు.
Read also: CM YS Jagan: నాలుగేళ్లలో మరెప్పుడూ చూడని విప్లవాత్మక మార్పు తెచ్చాం..
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సైతం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్‌డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read also: Vijay- Hatya: విజయ్ ఆంటోనీ ‘హత్య’ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ ఘటనపై హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ,ఖాటిక్ కమ్యూనిటీ ప్రజలు బలేహరి నివాసితులు. జాతర (తికమ్‌ఘర్) తన కూతురి పెళ్లికి మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహ్ర నది వంతెన దాటుతుండగా ట్రక్కు చక్రం తెగిపోవడంతో ట్రక్కు నదిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు 5 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 65 ఏళ్ల మహిళ కూడా ఉంది. 18 ఏళ్ల యువకుడితోపాటు.. రెండు, మూడు సంవత్సరాల పిల్లలున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 5 మంది మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!