కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాలు కురిసినప్పుడు వాహనాలు వరదల్లో చిక్కుకోవడం, బురదలో కూరుకుపోవడం చూస్తుంటాం. భారీ క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాహనాలను బయటకు లాగుతుంటారు. అయితే తాజాగా ఓ ఏనుగు నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్ కారును నిమిషాల్లోనే బయటకు లాగేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కొంతమంది దీనిపై నిజమైన ఏనుగు నకిలీ ఏనుగును లాగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఏనుగు శక్తి ముందు 166 హార్స్‌పవర్ విఫలమైందని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం…
బీహార్‌లోని పుర్నియా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది తెప్పపై వెళ్తున్నారు. హఠాత్తుగా అది అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది.
బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.
అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బ్రహ్మపుత్ర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్కు ముందు వాట్సాప్‌లో 'సారీ పిల్లలు' అని రాసింది. ఈ క్రమంలో.. దిబ్రూగఢ్‌లోని బోగిబీల్ బ్రిడ్జి టి-పాయింట్ సమీపంలో మహిళ, ఆమె పిల్లల కొన్ని వస్తువులను పోలీసులు గుర్తించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడటంతో ప్రయాణికులంతా నదిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.
నేపాల్ లోని త్రిశూలి నదిలో మంగళవారం తెల్లవారుజామున బాగ్మతి ప్రావిన్స్లో భారతీయ నంబర్ ప్లేట్తో కూడిన జీపు నదిలో పడిపోయింది. దీంతో నేపాల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చిత్వాన్ జిల్లాలోని త్రిశూలి నదిలో సాయంత్రం 4.30 గంటల సమయంలో బొలెరో వాహనం పడిపోయిందని ముంగ్లింగ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోదాలు జరుగుతున్నాయని.. అంతేకాకుండా, ఎవరైనా గల్లంతయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నదిలో పడిపోయిన వాహనం రిజిస్ట్రేషన్…