Nepal: నేపాల్ లోని త్రిశూలి నదిలో మంగళవారం తెల్లవారుజామున బాగ్మతి ప్రావిన్స్‌లో భారతీయ నంబర్ ప్లేట్‌తో కూడిన జీపు నదిలో పడిపోయింది. దీంతో నేపాల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చిత్వాన్ జిల్లాలోని త్రిశూలి నదిలో సాయంత్రం 4.30 గంటల సమయంలో బొలెరో వాహనం పడిపోయిందని ముంగ్లింగ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోదాలు జరుగుతున్నాయని.. అంతేకాకుండా, ఎవరైనా గల్లంతయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నదిలో పడిపోయిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ‘BR 09 BC 1430’గా గుర్తించారు.
Read Also: GVL: రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ.. రిక్షా తొక్కిన జీవీఎల్
అయితే.. జీపు నదిలో పడకముందే అందులో ఉన్న డ్రైవర్ తప్పించుకున్నాడని, సురక్షితంగా ఉన్నాడని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు తమకు చెప్పినట్లుగా.. అందులో ఉన్న డ్రైవర్ ఉదయం 5.30 గంటలకు మరొక వాహనంలో బయలుదేరడం అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు చూశారని చిత్వాన్ పోలీసు ప్రతినిధి డిఎస్పి శ్రీ రామ్ భండారీ ఓ మీడియాకు తెలిపారు.
Read Also: OYO: అయోధ్య, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఓయో ప్రాపర్టీలు..