Dhavaleshwaram project: గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఓ కీలక ప్రకటన వెలువడింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో ఆడిలైడ్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Read Aslo: Tecno Pop 6 Pro: టెక్నో స్మార్ట్ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ
ఈ సదస్సుకు ఏపీ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. సదస్సులో భాగంగా గురువారం ధవళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు ధవళేశ్వరం ప్రాజెక్టుకు దక్కిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అంబటి, కాకాణి అందుకున్నారు.
Read Aslo:Airtel 5G: ఎయిర్టెల్ 5జీ సేవలు షురూ.. 30 రెట్లు అధిక వేగంతో నెట్
సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట (ధవళేశ్వరం ఆనకట్ట) తూర్పు గోదావరి జిల్లా లోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రారంభించి 1852 నాటికి పూర్తిచెయ్యబడింది. పాత ఆనకట్ట బలహీనమైనందున కొత్త ఆనకట్టను 1970 లో నిర్మాణం ప్రారంభించి 1982 లో పూర్తి చేశారు.