MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై, అలాగే ఇతర సమస్యలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి…
చేనేత కార్మికులకు మంత్రి గుడ్న్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "మీకు నష్టం జరిగే ఏ పని చేయదు. నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు కుల…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12 నుంచి మొదలవబోతున్నాయి. దాంతో.... మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా? రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది రాజకీయవర్గాల్లో. బీఆర్ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందట కాంగ్రెస్. ఆయన పదేళ్ళ పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ...
ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు.…
Harish Rao: ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నారు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.
BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు.
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ రోజు (మార్చ్ 6) మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నియోజక వర్గ ఇంఛార్జుల పని తీరు ఏం బాగోలేదని వెల్లడించింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని తెలిపింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు మూడో గ్రూప్ గా విభజించిన నటరాజన్.
మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ ఎవరు దాటిన వారి పైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా, చిన్నారెడ్డి కైనా, రేవంత్ రెడ్డికి అయినా ఒకే చర్యలు ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరు అని మధుయాష్కీ పేర్కొన్నారు.