CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. కొన్ని వ్యక్తులు సలహాలు, సూచనలు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారని, కానీ వాటిని పాటించాల్సిన బాధ్యతను అనుసరించరని విమర్శించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించారని, అందువల్లే చంచల్‌గూడ జైల్లో అత్యంత కఠినమైన నక్సలైట్ సెల్‌లో 16 రోజులు ఉంచారని తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, సెల్‌లో ట్యూబ్‌లైట్ సరిగా పనిచేయక పోవడంతో అక్కడ బల్లులు, పురుగులు వేధించేవని వివరించారు. లైట్ ఆపాలని కోరినప్పటికీ పై నుంచి ఆదేశాలొచ్చాయని తిరస్కరించారని చెప్పారు.
ఆ కఠిన పరిస్థితులను అధిగమించి, పరిపాలనను కోపం ప్రదర్శించకుండా ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు. తన ప్రమాణం స్వీకరించిన రోజు ఆసుపత్రిలో చేర్చాడు దేవుడు.. తన బిడ్డ లగ్గానికి కూడా అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు. కండిషన్ బెయిల్ మీద విడుదలై వచ్చానని, కానీ రాజకీయ కక్ష సాధింపులో తాను ఎప్పుడూ దిగజారలేదని స్పష్టంగా చెప్పారు.
గత ప్రభుత్వం తన కుటుంబంపై ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసని, తాను కక్ష సాధించాలనుకుంటే వారి కుటుంబం మొత్తం జైలులో ఉండేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబం కోసం జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ కూడా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. తనను కించపరిచేందుకు, తనపై బూతులు మాట్లాడించేందుకు కొన్ని వ్యక్తులను ఉపయోగించినా, తాను మౌనంగా ఉండిపోయానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Shruti Hassan : ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్న